గోవాలో రష్మిక ఫుల్ ఎంజాయ్!

Rashmika Mandanna

గత 5 రోజులుగా గోవాలో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది రష్మిక. అయితే గోవా టూర్ లో కేవలం బీచ్ లో తన ఎక్సర్ సైజు వీడియోలు మాత్రమే పెట్టిన ఈ హీరోయిన్, అంతకుమించి ఇంకేం చూపించలేదు. మధ్యలో ఓసారి తను బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫొటో మాత్రం పోస్ట్ చేసింది. ఈసారి ఆ లోటు కూడా తీర్చేసింది ఈ బ్యూటీ.

తన గోవా విశేషాల్ని షార్ట్ అండ్ షార్ప్ గా చెబుతూ.. ఓ వీడియో పోస్ట్ చేసింది రష్మిక. తను దిగిన కాటేజ్ తో పాటు.. అందులో తన బెడ్ రూమ్ ను కూడా చూపించింది. తను చేసిన వ్యాయామాలు, వేసుకున్న దుస్తులు, తిన్న ఆహారం.. ఇలా టూర్ కు సంబంధించి కొన్ని విశేషాల్ని చెబుతూ ఒకటిన్నర నిమిషం వీడియో పోస్ట్ చేసింది. అలా కొన్ని రోజులుగా గోవాలో ఛిల్ అయింది రష్మిక.

రష్మిక … త్వరలోనే “పుష్ప” షూటింగ్ లో పాల్గొంటుంది. అల్లు అర్జున్ సరసన నటించనుంది.

Related Stories