అత్త పాత్రలో రేణు దేశాయ్

Renu Desai

రేణు దేశాయ్ ఆ మధ్య రవితేజ నటించిన “టైగర్ నాగేశ్వరరావు” సినిమాలో హేమలత లవణం అనే సామజిక సేవకురాలి పాత్రలో నటించారు. అది ఆమెకి క్యారెక్టర్ నటిగా కొత్త ఇన్నింగ్స్. ఐతే, ఆ సినిమా విడుదలైన తర్వాత ఆమె ఏ సినిమా ఒప్పుకోలేదు.

ఇన్నాళ్లకు ఆమె మళ్ళీ కొత్త సినిమా సైన్డ్ చేసింది. అత్త పాత్రలో నటిస్తోంది. ఒక కామెడీ చిత్రంలో తాను హీరోయిన్ కి అత్తగా నటిస్తున్నట్లు ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

“నాకు నచ్చిన పాత్రలు వస్తేనే చేస్తాను. అదేపనిగా సినిమాలు చెయ్యను. అలా అని ట్రోలింగ్ బ్యాచ్ కి భయపడి సినిమాలు ఒప్పుకోకుండా ఉండను. ఈ అత్త పాత్ర నచ్చింది అందుకే సైన్ చేశాను,”అని ఆమె పేర్కొంది.

రేణు దేశాయ్ భర్త పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక కొన్నాళ్ళు పూణేలో ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ షిప్ట్ అయి కొడుకు అకీరా, కూతురు ఆద్యలను చదివించారు. కొడుకు అకీరా నందన్ త్వరలోనే హీరోగా అరంగేట్రం చెయ్యనున్నాడు. కూతురు చదువుకుంటోంది.

More

 

Related Stories