రవితేజ సరసన రుక్మిణి?

- Advertisement -
Rukmini Vasanth

కొత్త హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే హీరో రవితేజ. ముఖ్యంగా “ఖిలాడీ” సినిమా నుంచి తన ప్రతి సినిమాలో కొత్త భామలు, వర్ధమాన నటీమణులతోనే జతకట్టాడు. “ఖిలాడీ”లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. ఇద్దరూ అంతకుముందు కేవలం ఒక్క సినిమా మాత్రమే చేశారు. ఆ తర్వాత విడుదలైన “రామారావు ఆన్ డ్యూటీ”లో రజిషా విజయన్, దివ్యంశా కౌశిక్ హీరోయిన్లు. వీళ్ళు వర్ధమాన నటీమణులే.

ఆ తర్వాత “ధమాకా “లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. “ధమాకా”కి ముందు శ్రీలీల కేవలం ఒక్క తెలుగు చిత్రంలోనే నటించింది. “టైగర్ నాగేశ్వరరావు”లో నుపుర్ సనన్, గాయత్రీ భరధ్వజ్, అనుకృతి వ్యాస్ నటించారు. ఈ ముగురుకి అదే మొదటి తెలుగు చిత్రం. త్వరలో విడుదల కానున్న “ఈగిల్”లో కావ్య థాపర్ హీరోయిన్. ఆమె ఇప్పటివరకు తెలుగులో కేవలం రెండు సినిమాల్లోనే నటించింది.

అలాగే త్వరలోనే రవితేజ మరో వర్ధమాన నటితో నటించనున్నాడు అని టాక్.

కన్నడ చిత్ర రంగానికి చెందిన రుక్మిణి వసంత్ రవితేజ సరసన నటించనుందట. “జాతిరత్నాలు” దర్శకుడు అనుదీప్ రవితేజతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఆమె “సప్తసాగరాలు దాటి సైడ్ ఏ” అనే సినిమాతో పాపులర్ అయింది.

More

Related Stories