- Advertisement -

అయోధ్య రామ మందిరానికి తమ సినిమా టికెట్ల వసూళ్ల నుంచి డబ్బులు ఇస్తామని “హనుమాన్” నిర్మాత విడుదలకు ముందే ప్రకటించారు. అన్నట్లుగానే ఇప్పటివరకు అమ్ముడైన టికెట్లపై ఇంత మొత్తం అయోధ్య రామమందిర నిర్మాణానికి అందచెయ్యబోతున్నామని మరోసారి నిర్మాత వివరాలు తెలిపారు.
ప్రతి టికెట్ మీద వచ్చే సొమ్ములో 5 రూపాయలను అయోధ్యకోసం తీస్తామన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ అందుకొంది.
సినిమా ప్రీమియర్ షోల నుండి విక్రయించిన 2,97,162 టిక్కెట్లలో ₹ 14,85,810 చెక్కును ఇప్పటికే అందించారు.
ఇక ఇప్పటి వరకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055 (రెండు కోట్ల 66 లక్షల రూపాయలు) అందిస్తున్నట్లు ప్రకటించారు. అలా రాముడి కోసం హనుమాన్ రెండు కోట్లు ఇవ్వబోతున్నారు.