శ్రీలీలకి గ్యాప్ తప్పదు

Sreeleela

శ్రీలీల చేతిలో ఉన్న అన్ని సినిమాలు అయిపోయాయి. “గుంటూరు కారం” విడుదల అయిపోయింది. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమా లేదు. ఆమె పవన్ కళ్యాణ్ సరసన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాలో నటిస్తున్న మాట వాస్తవమే కానీ ఆ సినిమా 10 రోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది.

“ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు కావాలంటే మరో ఆర్నెళ్లు ఆగాలి. ఈ గ్యాప్ లో ఆమె మరో సినిమా ఒప్పుకుంటే తప్ప షూటింగ్ కి వెళ్లాల్సిన అవసరం రాదు.

మార్చి, ఏప్రిల్ లో విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో మొదట ఈ భామనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు “యానిమల్” హీరోయిన్ తృప్తి డుమ్రి పేరు వినిపిస్తోంది. సో, శ్రీలీలకి ఇమ్మీడియేట్ గా షూటింగ్ కి వెళ్లాల్సిన సినిమా లేదు. 2023లో ఊపిరి సలపనంత బిజీగా షూటింగ్ లు చేసింది. 2024లో మాత్రం రిలాక్స్ డ్ ఉంది పరిస్థితి.

మరోవైపు, ఈ అమ్మడు తన ఎంబీబీఎస్ పరీక్షలు కూడా రాయాలి. ఆమె ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉంది. సినిమాలు చేస్తూనే చదువుకుంటోంది.

 

More

Related Stories