సింగర్ సునీత పెళ్ళి మళ్ళీ చర్చలో!

Singer Sunitha

“సింగర్ సునీత పెళ్లి చేసుకోబోతోంది.”

ఈ వార్త మీరు చాలా సార్లు చదివి ఉంటారు. గత ఐదారేళ్ళ కాలంలో అనేకసార్లు విని వుంటారు. ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. కొన్నిటిని ఆమె తోసిపుచ్చింది, కొన్ని పుకార్లపై సైలెంట్ గా ఉంది. ఐతే, ఆమె రెండో పెళ్లి ఇప్పటివరకు జరగలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ట్యూన్.

సునీత రెండో పెళ్ళికి ముహూర్తం, వరుడు ఫిక్స్ అని ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. ఆమె యథావిధిగా సైలెంట్.

సునీతకి ఇద్దరు పిల్లలు. అమ్మాయి చదువు పూర్తి అయింది, అబ్బాయి ఏకంగా ఉద్యోగంలో చేరాడు. భర్త నుంచి ఆమె విడిపోయి చాలాకాలం అవుతోంది. మరి ఈ వార్తలు అయినా నిజం అవుతాయా అన్నది చూడాలి.

Advertisement
 

More

Related Stories