సమంత, నయన్ మూవీ ఆగిపోయిందా?

Samantha and Nayanthara


విజయ్ సేతుపతి హీరోగా, సమంత, నయనతార హీరోయిన్లుగా గతేడాది ఒక సినిమా మొదలైంది. నయనతార కాబోయే భర్త విగ్నేష్ శివన్ ఈ సినిమాకి దర్శకుడు. నయనతార స్వయంగా నిర్మిస్తోంది. సమంత, నయనతార కాంబినేషన్ కావడంతో క్రేజ్ వచ్చింది. ఐతే, దీని షూటింగ్ మాత్రం పూర్తి కావడం లేదు.

గతేడాది సినిమా అనౌన్స్ చేసిన వెంటనే లాక్డౌన్ వచ్చింది. ఈ ఏడాది హైదరాబాద్ లో షూటింగ్ చేశారు. నెల రోజులు పాటు తీశాక మళ్ళీ ఇప్పుడు షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు, హీరో విజయ్ సేతుపతి హిందీ, తమిళ్ లో అనేక సినిమాలు ఒప్పుకున్నాడు. అతని డేట్స్ దొరకాలంటే కష్టం అవుతుంది. అందుకే ఈ సినిమాని పక్కన పెడతారని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

కానీ విగ్నేష్ శివన్ మాత్రం అలాంటి ఆలోచన చెయొద్దని అంటున్నాడు. నిర్మాతగా నయనతార సొంత సినిమా కాబట్టి ఆగిపోయే ప్రసక్తే ఉండదని చెప్తున్నారు. లేట్ అవుతుందేమో కానీ ఆగిపోదు అని క్లారిటీ వచ్చింది.

More

 

Related Stories