సమంత యాడ్స్ మాత్రం వదలట్లేదు!

Samantha

సమంత సినిమాల షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చింది. మయోసిటిస్ అనే వ్యాధి చికిత్స కోసమంటూ ఆమె సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఐతే విదేశీ పర్యటనలు చేస్తూనే ఉంది. దాంతో పాటు యాడ్స్ షూటింగ్ లు కూడా కంటిన్యూ చేస్తోంది. యాడ్స్ ఒప్పుకోవడం మాత్రం మానడం లేదు.

ప్రస్తుతం ఆమె సంపాదన అంతా బ్రాండ్స్, ఇంస్టాగ్రామ్ పోస్ట్ ల ద్వారానే. సినిమాల్లో నటిస్తే వచ్చే అమౌంట్ కన్నా ఎక్కువే వీటి ద్వారా వస్తోంది ఈ భామకి. అందుకే, ఇవి మాత్రం వదులుకోవడం లేదు.

తాజాగా ఆమె ముంబైలో ఉంది. అక్కడ ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొంటోంది. యాడ్స్ లేనప్పుడు హైదరాబాద్ లో, లేదంటే ఏదైనా కంట్రీలో వెకేషన్. ఇది ప్రస్తుతం సమంత లైనప్.

ఐతే, ఆమె వచ్చే ఏడాది మాత్రం రెండు కొత్త సినిమాలు మొదలుపెడుతుంది అని సమాచారం. ఈ లోపు ఇలా.

Advertisement
 

More

Related Stories