‘గుంటూరు కారం’ అప్డేట్ ఏంటంటే!

Guntur Kaaram


మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తీస్తున్న “గుంటూరు కారం” సినిమా షూటింగ్ సాగుతోంది. ఐతే, ఈ సినిమాకి సంబంధించి ఇంకా ప్రచారం మొదలు పెట్టడం లేదు. దాంతో, ఈ మూవీ అప్డేట్స్ ఏంటి ఫ్యాన్స్ లో ఒక ఆందోళన ఉంది. అనుకున్న టైం ప్రకారం విడుదల చెయ్యడం ఖాయమని నిర్మాతలు ధీమాగా ఉన్నారు.

ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12, 2024 విడుదల చేస్తారు.

ఇక ఈ దసరా పండుగకి ఒక అప్డేట్ రానుంది. ఈ సినిమా మొదటి పాట ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పేస్తారు మేకర్స్. ఆ అప్డేట్ తో పాటు ఒక పోస్టర్ విడుదల అవుతుంది. ఇది ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ఇన్ఫర్మేషన్.

ఇక షూటింగ్ మొత్తాన్ని డిసెంబర్ మొదటివారంలో కానీ, రెండో వారంలో కానీ పూర్తి చేస్తారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయి. దాంతో, విడుదల విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.

Advertisement
 

More

Related Stories