క్రిస్మస్ కోసం సమంత ఇల్లు ముస్తాబు!

Samantha decorating Christmas tree

సమంత అక్కినేని పుట్టింది క్రిస్టియన్ గా కానీ పెళ్లి చేసుకుంది హిందువుని. ఆమె ఇటు గుడికి వెళ్లి పూజలూ చేస్తుంది, అటు క్రిస్మస్ నాడు చర్చిలో ప్రార్థనలు చేస్తుంది. రెగ్యులర్ గా తిరుమల తిరుపతి దేవుణ్ణి మెట్లు ఎక్కి మరి దర్శించుకుంటుంది.

మరో 9 రోజుల్లో క్రిస్మస్ పండుగ. అందుకే, తన ఇల్లుని క్రిస్మస్ కోసం ముస్తాబు చేస్తోంది సమంత. ఎవ్రి ఇయర్ తన ఇంటిని క్రిస్మస్ డెకొరేటివ్ ఐటమ్స్ తో తనే స్వయంగా తీర్చిదిద్దుతుంది. క్రిస్మస్ ట్రీ చెయ్యడం నుంచి మొదలు పెడితే అన్ని తానే చేసుకుంటుందట. ఆ వీడియో ని తాజాగా ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసింది.

మరోవైపు, సమంత అటు టాక్ షో హోస్ట్ గా బిజీగా ఉంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, చిరంజీవి, రానా, తమన్నా వంటి సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన ఈ భామ లేటెస్ట్ గా బన్నీని కూడా టాక్ షోకి రప్పించింది.

More

 

Related Stories