- Advertisement -

భర్త నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత తన కెరియర్ ని తీర్చిదిద్దుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే రెండు కొత్త సినిమాలు అనౌన్స్ చేసింది. రెండూ కూడా కొత్త దర్శకులు తీసే చిత్రాలే. మరో హిందీ సినిమా కూడా ఒప్పుకుందట. కానీ దాని ప్రకటన ఇంకా రాలేదు.
అలాగే, ఆమె మరో వెబ్ సిరీస్ సైన్ చేయనుంది. చర్చలు మొదలయ్యాయి. ఆ వెబ్ సిరీస్ ఓకె ఐతే ఆమె రేంజ్ మారిపోతుంది. గ్రాండ్ గా దాన్ని అనౌన్స్ చేస్తుంది.
ఇలా సినిమాలతో పాటు వెబ్ కంటెంట్ పై కూడా ఫోకస్ పెట్టింది. తనే సొంతంగా ఒక బ్యానర్ పెట్టి వెబ్ కోసం సిరీస్ లు కూడా నిర్మించనుంది అని టాక్. మరోవైపు, సమంతకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా సంపాదన బాగా ఉంది. ఆమెకి వస్తున్న యాడ్స్ సంఖ్య అలా ఉంది. మొత్తానికి సమంత తన కెరీర్ విషయంలో వెంటనే ట్రాక్ లోకి వచ్చింది.