ఇండియాలో సమంత మళ్ళీ బిజీ బిజీ

Samantha

సమంత మొన్నటి వరకు అమెరికాలో ఉంది. సోమవారం ఉదయమే ఇండియాకి వచ్చింది. మళ్ళీ అప్పుడే హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళింది.

సమంత కొంతకాలంగా మయోసిటిఎస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఆ చికిత్స కోసమే అమెరికా వెళ్ళింది. ఐతే, అమెరికాలో ఆమె అనేక సిటీస్ తిరిగింది. అనేక ఈవెంట్లలో పాల్గొంది. దాంతో, ఆమె నిజంగానే చికిత్స కోసం అమెరికా వెళ్లిందా లేక టూర్ కోసమా అన్న డౌట్ అందరిలో కలిగింది.

ఇక హైదరాబాద్ కి తిరిగొచ్చిన ఒక్క రోజులోనే మళ్ళీ ఆమె ముంబై వెళ్ళింది.

మరి, సమంత ఇంతకుముందు చెప్పినట్లు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటుందా లేక మళ్ళీ వెంటనే సినిమాలు సైన్ చేస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె ఎనర్జీ లెవల్స్ చూస్తే మళ్ళీ వర్క్ లో పడిపోతుంది అనిపిస్తోంది. ఇది అభిమానులకు గుడ్ న్యూస్.

Advertisement
 

More

Related Stories