సమంతకీ తప్పని ట్రోలింగ్

- Advertisement -
Samantha Stills 190423 001

ఆ మధ్య ఎన్టీఆర్ అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడిన తీరు బాగా ట్రోలింగ్ కి గురైంది. ఆస్కార్ ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్ అమెరికన్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాళ్ళకి అర్థం అయ్యేలా మాట్లాడాలనే తపనలో తెచ్చిపెట్టుకున్న యాక్సెంట్ (యాస)లో మాట్లాడడం విమర్శలకు గురైంది. చాలామంది నెటిజెన్స్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేశారు.

ఇపుడు అలాంటి ట్రోలింగ్ కి గురి అవుతోంది సమంత. నిజం చెప్పాలంటే ఈ మధ్య సమంత ప్రతి విషయంలోనూ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. ఇప్పుడు ఆమె ఇంగ్లిష్ యాక్సెంట్ కూడా ట్రోలింగ్ అవుతోంది.

‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ ప్రీమియర్ కి సమంత అటెండ్ అయిన విషయం తెలిసిందే. లండన్ లో జరిగిన ఈ ఈవెంట్ కి సమంత హాజరవ్వడమే కాకుండా మీడియాతో ముచ్చటించింది. బ్రిటీష్ యాసలో మాట్లాడే ప్రయత్నంలో ఆమె చేసిన హంగామా బాగా విమర్శలకి గురైంది.

ఆమె యాస అంతా ఫెక్ అనేది కామెంట్. చక్కగా తన సహజమైన శైలిలో మాట్లాడకుండా ఎందుకు ఫెక్ యాక్సెంట్ అని నెటిజన్స్ విమర్శించారు.

More

Related Stories