‘సైడ్ బి’ మరీ స్లోనా!

Sapta Sagaralu Dhaati Side B

కన్నడ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి హీరో, హీరోయిన్లుగా రూపొందిన “సప్త సముద్రాలు దాటి సైడ్ ఏ” అనే ప్రేమకథాచిత్రం బాగా ప్రశంసలు అందుకొంది. లవ్ స్టోరీస్ లలో ఇదొక క్లాసిక్ అని పలువురు క్రిటిక్స్, మూవీ లవర్స్ ప్రకటించారు. అంతగా పేరు సంపాదించిన ఈ సినిమాకి రెండో భాగంగా తెరకెక్కిన సప్త సముద్రాలు దాటి సైడ్ బి” నిన్న (నవంబర్ 17) కన్నడంలోనూ, తెలుగులోనూ విడుదలైంది.

ఐతే, “సైడ్ బి” అంచనాలు అందుకోలేకపోయింది. “సైడ్ బి” కూడా బాగుంది అని కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ ఎక్కువగా మాత్రం మరీ స్లోగా, నీరసంగా సాగింది అనే రివ్యూస్ చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రక్షిత్ శెట్టి, రుక్మిణి ఒక్కసారి కూడా కలవకపోవడం, హీరో సినిమా మొత్తం ఆమెని దాక్కొని దాక్కొని చూడడంతోనే సరిపోయింది అని అంటున్నారు.

ఒకప్పుడు విడుదలైన “రాజా” సినిమాలో వెంకటేష్ ని సౌందర్య నిందించి తన నుంచి దూరం వెళ్లిపోయామంటే వెంకటేష్ ఆమె బాగు కోసం చాటుగా ప్రయత్నాలు చేస్తాడు. ఆమె నడుస్తుంటే ఆమె వెనకాలే దూరంగా నడుస్తుంటాడు. ఆమెకి ఎన్నో సాయాలు చేస్తాడు తాను చేశాడని ఆమె గుర్తించకుండా. దాదాపుగా రక్షిత్ శెట్టి ఈ సినిమా మొత్తం అలాగే చేశాడట.

మొత్తంగా “సైడ్ బి” మొదటి భాగం అంత పేరు తెచ్చుకోలేదు. “సాగ(ర) తీ….. త” అని ముద్ర వేసుకొంది. ఐతే, ఈ సినిమాలో వేశ్యగా నటించిన చైత్ర ఆచార్ అనే నటి మాత్రం కాంప్లిమెంట్స్ అందుకొంటోంది.

Advertisement
 

More

Related Stories