అలా చేసి షేప్ లోకి వచ్చా: శ్రియ

Shriya Saran

హీరోయిన్ శ్రియ ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా గ్లామర్ ఫోటోలను షేర్ చేసేది. తన ప్రెగ్నన్సీ విషయాన్నీ రహస్యంగా దాచింది. తన కూతురుకు 9 నెలలు వచ్చిన తర్వాతే తాను తల్లిని అయ్యాను అని ప్రపంచానికి తెలియచేసింది. కూతురు మొదటి బర్త్ డే రాకముందే ఆమె మళ్ళీ సినిమాల్లోకి వస్తోంది.

ఆమె రెండేళ్ల క్రితం నటించిన ‘గమనం’ అనే సినిమా ఎట్టకేలకు విడుదల అవుతోంది. ఈ వీకెండ్ విడుదల కానుంది. అలాగే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాల ప్రమోషన్స్ కోసం ఆమె తాజాగా హైదరాబాద్ కి వచ్చింది. చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు అని మీడియా ప్రశ్నించింది. దాంతో తాను మళ్ళీ ఎలా షేప్ లోకి వచ్చిందో బయటపెట్టింది శ్రియ.

“తల్లి అయిన తరువాత బాడీలో మార్పులు వచ్చాయి. బాగా లావు అయ్యాను. డెలివరీ తర్వాత కొన్నాళ్ళు అలాగే ఉన్నాను. కానీ ఆ తర్వాత వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ సాధించాను. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగాను నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది,” అని అసలు విషయం చెప్పారు శ్రియ.

శ్రియాకిప్పుడు 38 ఏళ్ళు. ఆమె మాతృత్వపు మధురిమని ఆస్వాదిస్తున్నారు. “అవును.. పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకుని వెళ్తున్నాం. పాప లేనిది ఉండలేం,” అని అంటున్నారు శ్రియ.

మరి సినిమాల సంగతి? “చేస్తాను. వర్క్, ఫ్యామిలీ బాలన్స్ చేసుకోగలను,” అనేది ఆమె సమాధానం.

Advertisement
 

More

Related Stories