- Advertisement -

కోవిడ్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. కోవిడ్ బాధిత కుటుంబాల్లో దుఃఖం పేరుకొంది. లేని వారిలో కూడా ఎదో టెన్షన్. అందుకే కాస్త మీ మనసులని తేలికపర్చుతాను అంటూ హీరోయిన్ శ్రీయా ఒక వీడియో పెట్టింది.
అది డ్యాన్స్ వీడియో. “ఒకవైపు తుఫాన్. మరోవైపు కరోనా. ఇది సంక్షోభ కాలం. అందుకే ప్రకృతి మాత కోసం ఈ డ్యాన్స్.
మీ ముఖాల్లో కొంతైనా సంతోషం వికసిస్తుంది అని భావిస్తున్నా,” అంటూ శ్రీయా ఈ డ్యాన్స్ వీడియో పెట్టింది.
37 ఏళ్ళ శ్రియా భర్తతో కలిసి స్పెయిన్ లో సెటిల్ అయింది. ఆమె తెలుగులో నటించిన ‘గమనం’ గతేడాది విడుదల కావాలి. కానీ కరోనా వల్ల ఆగిపోయింది.