శ్రియ ఎదపై పబ్లిక్ గా ముద్దు!

- Advertisement -
Shriya Kiss

అందాల శ్రియ, ఆమె భర్త ఆండ్రీ కొశ్చివ్ తెగ విహార యాత్రలు చేస్తున్నారు. ఆ టూర్ వీడియోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది శ్రియ. తాజాగా చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఎందుకంటే… ఈ వీడియోలో ఆమె భర్త ఆమె ఎదపై ముద్దు పెట్టాడు… అవును ఇది నిజమే.

ఒక మోటార్ బోట్ లో ప్రయాణిస్తూ తన భర్త వొళ్ళో కూర్చొని ఈ వీడియోని రికార్డ్ చేసింది శ్రియ.

తన గురించి అతనికి తెలిసిన విషయాలేంటో ఆమె అడిగి తెలుసుకొంది. అందులో ఆమె ఆండ్రీని అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే… వన్ థింగ్ అన్నొయింగ్ అబౌట్ మీ (నాలో చికాకు తెప్పించేది ఏంటి?). అతను సమాధానం ఇవ్వకుండా ఆమె ఎదపై ముద్దు పెట్టుకున్నాడు. దాంతో శ్రియ పడి పడి నవ్వింది.

ఆమె అడిగిన ప్రశ్నకి అతను ముద్దు పెట్టుకొని ఇచ్చిన సమాధానం ఏంటో. అది వాళ్ళకే అర్థం కావాలి. అందుకే, జనాలు కూడా భలే కామెంట్స్ పెడుతున్నారు. “బాబూ ఆండ్రీ ఆమె ఎంచుకున్న రాగం ఏంటి… నువ్వు చించుకున్న తాళం ఏంటి?”అంటూ జనాలు కామెడీ చేస్తున్నారు.

శ్రియ, ఆండ్రి మూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన ఏడాది పాటు తన భర్త ఫోటోలను పెద్దగా షేర్ చెయ్యలేదు. కానీ గతేడాది కరోనా లాక్డౌన్ తర్వాత వీళ్ళిద్దరూ హాట్ హాట్ ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. అందులో కొన్నింటికి అడల్ట్ సర్టిఫికెట్ అవసరమే.

More

Related Stories