‘అక్కా మంచి బట్టలేసుకో’

కొత్త కొత్త ఫోటోషూట్ లకు ఇన్ స్టాగ్రామ్ వేదిక అయింది. చాలామంది హీరోయిన్లు ప్రతిరోజూ ఎదో ఒక ఫోటో షేర్ చేస్తున్నారు. ఇక శ్రీముఖి, ఆశు రెడ్డి, ఇషా రెబ్బ వంటి హీరోయిన్లు వారానికి రెండు, మూడు ఫొటోషూట్లు చేసి ఇన్ స్టాగ్రామ్ లో పెడుతున్నారు.

వీరికి ఫాలోవర్స్ పెరుగుతున్నది కూడా ఈ ఫోటోల వల్ల. వీరి క్రేజ్ పెరుగుతున్నకొద్దీ బట్టల సైజ్ తగ్గుతోంది. శ్రీముఖి కూడా ఈ మధ్య తరుచుగా పొట్టి గౌన్లు వేసుకొని తన కాళ్ళు చూపిస్తోంది. అలాగే లో నెక్ డ్రెస్సులు ధరించి హీట్ పెంచుతోంది. తాజాగా పెట్టిన ఫోటోలను చూసి ఆమె అభిమానులు పలువురు “అక్కా మంచి బట్టలేసుకో… నీ స్థాయిని తగ్గించుకోకు” అంటూ సలహాలిస్తున్నారు.

మరో సుందరి ఆశు రెడ్డి కూడా ఇలాంటి సలహాలే పొందుతోంది. ఈ భామ అందాలు అరబోయడంలో బాగా రెచ్చిపోతుంది. దాంతో ఆమె ఫోటోల కింద కామెంట్లు “ఇవన్నీ ఎందుకు చేస్తున్నావో మాకు తెలుసులే” తరహాలోనే ఉన్నాయి.

శ్రీముఖి, ఆశు రెడ్డి, ఇషా రెబ్బ… వీళ్ళు ఇంత ఎక్స్ పోజింగ్ చేసి ఫోటోలు షేర్ చేసినా సినిమా అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు. శ్రీముఖి పూర్తిగా టీవీ కార్యక్రమాలకు, ఓటిటి షోలకు పరిమితం అయింది. ఆశు రెడ్డి కూడా యాంకరింగ్ కి ఫిక్స్ అయింది. ఇషా రెబ్బ తమిళ, మలయాళ సినిమాల్లో ఎక్కువగా దర్శనమిస్తోంది.

Advertisement
 

More

Related Stories