
శ్రీనిధి శెట్టి మొదట “కేజీఎఫ్” సినిమాలతో గుర్తింపు తెచ్చుకొంది. ఆ తర్వాత తెలుగులో నాని సరసన “హిట్ 3″లో నటించింది. ఇప్పుడు “తెలుసు కదా”లో సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటించింది. ఈ సినిమాలో అతనికి మాజీ ప్రియురాలిగా కనిపిస్తుంది.
ఈ సినిమాకి నీరజ కోన దర్శకురాలు. ఒక లేడి డైరెక్టర్ తో పని చెయ్యడం కొత్తగా అనిపించింది అనీ, అందుకే ఈ సినిమా స్పెషల్ అని చెప్తోంది ఈ భామ.
“ఇది చాలా స్పెషల్ ఫిలిం. కథ చాలా నచ్చింది. నీరజ అద్భుతంగా రాసింది. నీరజ అందరికీ నచ్చుతుంది. తన నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను,” అని పేర్కొంది.
ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది. రాశి ఖన్నాతో ఆమెకి కీలకమైన సీన్లు ఉన్నాయి. “రాశిఖన్నాతో వర్క్ చేయడం సూపర్బ్ అనిపించింది. అంజలి క్యారెక్టర్ ని ఆమె అద్భుతంగా పెర్ఫాం చేసింది. సిద్దు కూడా మంచి నటుడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు సెట్లో,” అని తెలిపింది.





