మళ్ళీ వస్తోన్న శ్రియా రెడ్డి

Sriya Reddy

హీరోయిన్ శ్రియా రెడ్డి గుర్తుందా? “అప్పుడప్పుడు”, “అమ్మ చెప్పింది” వంటి సినిమాల్లో నటించిన శ్రియా రెడ్డి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. హీరో విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణను ఆమె పెళ్లాడారు. వీరికి ఒక అబ్బాయి. 40 ఏళ్ల శ్రియా రెడ్డి ఇప్పుడు మళ్ళీ మేకప్ వేసుకున్నారు.

Advertisement

ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న ‘సలార్’ చిత్రంలో ఆమె ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని ఆమె తాజాగా పూర్తి చేశారు.

తాను మళ్ళీ ఇలాంటి పాత్ర చెయ్యగలను అని నమ్మిన ప్రశాంత్ నీల్ కి థాంక్స్ అంటూ ఆమె ఒక లెటర్ కూడా రాశారు. ఈ సినిమాలో నటించేందుకు ఆమె చాలా కష్టపడి ఫిట్ నెస్ సాధించారు. ‘సలార్’లో ఆమె పాత్రకు గుర్తింపు దక్కితే ఆమెకి కొత్త ఇన్నింగ్స్ లో కూడా క్రేజ్ పెరుగుతుంది.

ఆమె ఆ మధ్యలో రెండు సినిమాలు కూడా నిర్మించారు కానీ ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నారు. నటిగా మళ్ళీ బిజీ కావాలనేది ఆమె ఆలోచన.

Advertisement
 

More

Related Stories