సునీల్ కి ఇలా కలిసొచ్చింది!

Sunil

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు, ఎవరు బిజీ అవుతారో చెప్పలేం. కమెడియన్ గా స్టార్ స్టేటస్ అందుకున్న సునీల్ ఆ తర్వాత హీరో అయ్యారు. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత మళ్ళీ అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ “పుష్ప” సినిమాలో విలన్ గా చెయ్యడంతో దశ, దిశ మారింది.

ఇప్పుడు తమిళంలో ప్రతి పెద్ద సినిమాలో సునీల్ ఉండాల్సిందే అన్నట్లుగా తయారు అయింది. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాతో పాటు పలు తెలుగు పెద్ద సినిమాల్లో కూడా సునీల్ నటిస్తున్నారు ఇప్పుడు.

సునీల్ ఇప్పుడు విలన్, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నారు. అలా బిజీ అయ్యారు.

ఒకప్పుడు కమెడియన్ గా నటించిన డబ్బుల కన్నా ఇప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తోందట. సో, మళ్ళీ సునీల్ కి ఇలా కలిసొచ్చింది.

Advertisement
 

More

Related Stories