టికెట్ రేట్లు పెంపు అప్పుడే

NTR


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే 4 షోలకు అనుమతి ఇచ్చింది. దాంతో, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”, “పెళ్లి సందడి’ వంటి చిత్రాలు లాభపడ్డాయి. ఇక అసలైన టికెట్ రేట్ల పెంపు గురించి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఈ టికెట్ రేట్ల విషయంలో ఏమైనా హెల్ప్ చేస్తాడా అని ఇండస్ట్రీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. “సీఎం జగన్ మా బావ….” అని తెగ ప్రచారం చేసుకున్నారు విష్ణు ఎన్నికల సందర్భంగా.

ఐతే, బావ కోరినా, బావమరిది అడిగినా ముఖ్యమంత్రి జగన్ టికెట్ రేట్ల పెంపు గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకునేలా లేరు. సంక్రాంతి టైంకి డెసిషన్ వస్తుంది అంటున్నారు. “ఆర్ ఆర్ ఆర్ ” వంటి పెద్ద సినిమాలు జనవరిలో విడుదల కానున్నాయి. ఎన్టీఆర్ తరఫున కూడా మంత్రి కొడాలి నాని అడగాల్సి ఉంటుంది. అందుకే, టికెట్ రేట్ల పెంపు జనవరిలో ఉండొచ్చు అని చెప్తున్నారు.

150 రూపాయలకు మించి ఒక్కా పైసా రేటు పెరగదు. కాకపొతే, మరి 20, 30 రూపాయల కనీస టికెట్ రేట్లను 50 నుంచి 55 రూపాయలకు పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా అంగీకారం తెలిపిందట.

అయితే, ప్రభుత్వ ఆదేశాలు, రూల్స్ ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో భారీ సినిమా విడుదలేనప్పుడు మొదటిరోజు ‘అడ్డగోలు’ టికెట్ రేట్లతో ఆడించడం కామన్. సగం సింగిల్ స్క్రీన్ థియేటర్లు రాజకీయనాయకుల అండదండలతో నడిచేవే.

Advertisement
 

More

Related Stories