తెగ సంపాదిస్తోన్న త్రివిక్రమ్

Trivikram


డైరెక్టర్ త్రివిక్రమ్ ఇప్పుడు సంపాదన మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. స్టార్ డైరెక్టర్ గా తనకున్న బ్రాండ్ ఇమేజ్ ని పూర్తిగా వాడుకుంటున్నారు. ఆయన ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుల్లో ఒకరు. దానికి తోడు, రచయితగా కూడా మనీ వస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ సినిమాకి ఆయన అందిస్తున్న రైటింగ్ సేవలకు భారీగానే ముట్టనుంది.

ఇది కాకుండా ఆయనకి థియేటర్ల బిజినెస్ కూడా ఉందని లేటెస్ట్ గా తెలిసింది. ఇప్పుడు నిర్మాతగా మారారు. ఇంతకుముందు, సితార సంస్థ నిర్మించే సినిమాల్లో అనధికార భాగస్వామిగా ఉండేవారు. ఇప్పుడు పూర్తి నిర్మాతగా మారారు.

ఆయన భార్య పేరుతో సినిమాల నిర్మాణం మొదలైంది. మొదటి చిత్రంలో నవీన్ పోలిశెట్టి హీరో. తాజాగా ప్రకటన వచ్చింది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది.

రచయితగా, దర్శకుడిగా, సినిమా హాల్ ఓనర్ గానే కాకుండా అప్పుడప్పుడు యాడ్స్ తీస్తూ కూడా డబ్బు సంపాదిస్తుంటారు. ఇప్పుడు నిర్మాతగా మరింత అమౌంట్ రానుంది. అంటే ఆల్ రౌండ్ ఎర్నింగ్ అన్నమాట. ఐతే, సినిమా ఇండస్ట్రీ నుంచి సంపాదించిన డబ్బును సినిమా రంగంపైనే ఖర్చు పెడుతుండడం అభినందించదగ్గ విషయమే.

 

More

Related Stories