హాట్ సీన్స్ చేశాను: విష్ణుప్రియ

Vishnu Priya

విష్ణుప్రియ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న టీవీ యాంకర్. ఈ అందాల భామ ఇప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు వెతుక్కుంటోంది.

విష్ణుప్రియ తాజాగా ‘చెక్‌మేట్’ అనే చిన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో హాట్ హాట్ సీన్లలో నటించిందట. డిజిటల్ మీడియాలో డైరెక్ట్ గా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య వెబ్ డ్రామా, వెబ్ సినిమా అనగానే ముద్దు సీన్లు, ఎక్సపోజింగ్ దృశ్యాలు మితిమీరి తీయడం కామన్ అయింది. అందుకే, తాను అలాంటి సీన్లు చేశాను అని చెప్తోంది విష్ణుప్రియ.

విష్ణుప్రియ భీమనేని తెలుగు అమ్మాయి. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఈ అందాల భామ …అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీముఖిలా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై రాణించాలనుకుంటోంది.

More

Related Stories