తెలుగు మార్కెట్టే ముఖ్యం: గణేష్

TeluguCinema Team 17 Sep 2025
VTV Ganesh

తమిళ నటుడు VTV గణేష్ తెలుగులో ఈ మధ్య బాగా పాపులర్ అయ్యారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన “బీస్ట్” సినిమాలో ఆయన చెప్పిన తెలుగు డైలాగ్ బాగా వైరల్ అయింది. దాంతో ఆయనికి వరుసగా తెలుగులో అవకాశాలు వస్తున్నాయి.

“సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలో కూడా తెలంగాణ అధికార పార్టీ అధ్యక్షుడిగా ఆయన కామెడీ బాగా పేలింది. అలాగే ఈ ఏడాది “సింగిల్” సినిమాతో కూడా హిట్ అందుకున్నారు. దాంతో, ఆయన ఇప్పుడు తనకు తెలుగు మార్కెట్టే ముఖ్యం అంటున్నారు.

“నేను నటించిన బీస్ట్ సినిమాలో చెప్పిన ఒక్క తెలుగు డైలాగ్ బాగా వైరల్ అయింది. తెలుగు వాళ్ళు నన్ను బాగా ఆదరిస్తున్నారు. ఒక్క డైలాగుతో 10 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తెలుగులో అనేక చిత్రాలు ఉన్నాయి,” అని తాజాగా ఒక ఈవెంట్ లో పేర్కొన్నారు గణేష్.

అంతేకాదు, తన తమిళ చిత్ర నిర్మాతలకు, దర్శకులకు గట్టిగా చెప్తున్నాడు తన డైలాగులు తానే తెలుగులో డబ్ చేస్తానని. తాను నటించిన తమిళ సినిమా ఏదైనా తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే తన గొంతుకు వేరే వాళ్ళతో డబ్ చేయించొద్దని తమిళ సినిమా మేకర్స్ కి చెప్తున్నాడు. తన వాయిస్ తానే తెలుగులో డబ్బింగ్ చెప్తాను అని క్లారిటీ ఇచ్చాడు.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News