బోల్డు అన్నా, ఓల్డు అన్నా ఓకే: మలైక

TeluguCinema Team 17 Sep 2025
Malaika Arora

మలైకా అరోరాకి ఇప్పుడు 52 ఏళ్ళు. ఆమె కొడుకు వయసు 22 ఏళ్ళు. కానీ ఈ వయసులో యమా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే మొన్నటి వరకు తనకన్నా 12 ఏళ్ల చిన్నవాడితో (హీరో అర్జున్ కపూర్ తో) ఎఫైర్ నడిపింది. ఇప్పుడు మరో వ్యక్తితో డేటింగ్ లో ఉంది. 50 ప్లస్ ఏజ్ లో ప్రేమ సంబంధాలు, తొడలు, వక్షసంపద కన్పించేలా దుస్తులు వేసుకోవడాలు, ఫోటోషూట్ లలో రెచ్చిపోవడాలు వంటివి ఆమె క్యారెక్టర్ పై కామెంట్లు పడేలా చేశాయి.

“నన్ను రకరకాలుగా కామెంట్లు చేస్తారు. బూతులు కూడా తిడుతారు. ఆంటీకి సెక్స్ పిచ్చి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. కొందరు ముసలి వయసులో ఇవి అవసరమా అంటూ అడుగుతుంటారు. కానీ అవేవి ఏను పట్టించుకోను. ఇతరుల నన్ను ఎలా జడ్జి చేసినా, ఎలాంటి ముద్ర వేసినా నాకు ఫరకు పడదు,” అని తాజా ఇంటర్వ్యూలో మలైక చెప్పారు.

“నేను ఎవరికీ జవాబు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. చివరికి ఎవరైనా ఎవరి జీవితంలో వారికి వారే సమాధానం ఇచ్చుకోవాలి. మనకు నచ్చినట్లు ఉండాలి. వేరే వాళ్ళ కామెంట్లను సీరియస్ గా పట్టించుకుంటే మనం సంతోషంగా బతకలేం. నేను ఏమి చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది,” అనే మరింతగా వివరించారు.

ALSO CHECK: Malaika Arora shares selfie moods

“నన్ను కొందరూ టూ బోల్డు అంటారు, కొందరు ఓల్డు అంటారు. నా ప్రవర్తన ఎవరికైతే టూ మచ్ గా అనిపిస్తుందో వారు నా గురించి ఆలోచించకుంటే వారికే మంచిది,” అని మలైకా సూటిగా చెప్పారు.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

View all posts

Recent News