రకుల్ ప్రకటన వెనుక కథేంటి?

rakul kondapolam interviewmain


రకుల్ ప్రీత్ సింగ్ కిప్పుడు 31 ఏళ్ళు. 32లోకి అడుగుపెడ్తున్న వేళ తన లవ్ మేటర్ ని బయటపెట్టింది. బాలీవుడ్ నిర్మాత కొడుకు జాకీ భగ్నానీ కొడుకుతో ప్రేమ బంధం పెంచుకున్నట్లు స్వయంగా ప్రకటించింది. ఆమె ఇలా ఓపెన్ గా ప్రకటించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.

రకుల్ ఇన్నేళ్ళలో పలువురి సెలెబ్రిటీలతో డేటింగ్ చేసింది. కానీ ఆ విషయాలను ఓపెన్ గా ఎప్పుడూ చెప్పుకోలేదు. వాటిని రహస్యంగానే ఉంచింది. “నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు,” అనే కలర్ ఇస్తూ వచ్చింది. మరి, ఇప్పుడు జాకీ గురించి అంత బహిరంగంగా ఎందుకు ప్రకటించింది అనే అందరిలోనూ డౌట్.

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటివరకు చేసిన డేటింగ్ లు ఏవీ సీరియస్ గా మరో స్థాయికి వెళ్ళలేదంట. ఈ వ్యవహారం మాత్రం పెళ్లి వరకు వెళ్లే బంధం అని ఆమె భావిస్తోందట. అందుకే, పుట్టినరోజు నాడే తన ప్రియుడు ఇతనే అని ప్రకటించింది. ఇరువైపులా పెద్దల నుంచి ఇప్పటికే అంగీకారం కూడా వచ్చింది అని టాక్. రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు తెలుగులో కన్నా హిందీలో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయో కూడా తెలిసిపోయింది కదా.

రకుల్ చేతిలో ఇప్పుడు మరో తెలుగు మూవీ లేదు. కానీ హిందీలో ఏడు సినిమాలున్నాయి.

Rakul

ALSO READ: Rakul and Jaccky make their relationship official

More

 

Related Stories