- Advertisement -

శృతి హాసన్ బాలకృష్ణ సరసన నటించనుందా? దర్శకుడు గోపీచంద్ మలినేని ఆమెని సంప్రదించాడని టాక్. గోపీచంద్ తీసిన ‘బలుపు’, ‘క్రాక్’ సినిమాల్లో శృతి నటించింది. ఆ రెండు సినిమాలు పెద్ద హిట్ కావడంతో ఆమె తనకి లక్కీ హీరోయిన్ అనే నమ్మకం కలిగింది.
అందుకే…. తన తదుపరి చిత్రంలోనూ ఆమెని తీసుకోవాలని ట్రై చేస్తున్నాడు. కానీ బాలయ్య సరసన నటిస్తే శృతి హాసన్ కి ‘సీనియర్ హీరోయిన్’ అనే ముద్ర పడుతుంది. ఆ తర్వాత యంగ్ హీరోల సరసన అవకాశాలు ఆటోమేటిక్ గా మూసుకు పోతాయి.
మరి 35 ఏళ్ల శృతి హాసన్ బాలయ్య సరసన నటించేందుకు ఒప్పుకుంటుందా? ప్రస్తుతం ఆమె కెరీర్ ఎండింగ్ కి చేరుకొంది. కాబట్టి ఒప్పుకునే అవకాశం ఉంది.
Also Check: Shruti Haasan sends virtual love