శ్రీలీలతో ఐటెం సాంగ్ చేయిస్తారా?

- Advertisement -
Sreeleela

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో శ్రీలీలలా డ్యాన్స్ చేసే హీరోయిన్ లేదు. ఆమె డ్యాన్స్ చేస్తే ఆమె ఎనర్జీకి మ్యాచ్ అయ్యేందుకు హీరోలు కూడా అపసోపాలు పడాల్సిందే. “వామ్మో అదేమి డ్యాన్స్… అదేమీ ఎనర్జీ” అని ఇటీవల ఆమె డ్యాన్స్ ని మెచ్చుకున్నారు హీరో మహేష్ బాబు.

ALSO CHECK: Sreeleela’s phalat moment

ఇప్పటివరకు ఈ భామ హీరోయిన్ గా మాత్రమే సినిమాలు చేసింది. మొదటిసారి ఆమెతో ఒక స్పెషల్ సాంగ్ చేయించాలనే ఆలోచన వచ్చిందట ఒక సినిమా టీంకి.

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తీస్తున్న “పుష్ప 2” సినిమాలో ఐటెం సాంగ్ ని ఒక బాలీవుడ్ భామతో చేయించాలని భావిస్తోంది టీం. కృతి సనన్, దిశా పటాని వంటి భామల పేర్లను పరీశీలిస్తున్నారు. ఐతే, తాజాగా “గుంటూరు కారం”లో ఆమె మాస్ డ్యాన్సులు చూసిన తర్వాత శ్రీలీలతో ఈ ఐటెం సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చిందట.

మరి శ్రీలీల ఈ ప్రొపజల్ తన వద్దకు వస్తే ఊ అంటుందా? ఊఊఁ అంటుందా?

More

Related Stories