
ఉన్నఫలంగా వెంకటేశ్ (Venkatesh) ను మెచ్చుకుంటున్నారు జనం. అతడేం చేయలేదు. అవును.. ఏమీ చేయకపోవడం వల్లనే వెంకటేశ్ ను జనం మెచ్చుకుంటున్నారు. ఫైవ్ స్టార్ చాక్లెట్ యాడ్ లా అనిపించినా ఇదే నిజం.
ఈరోజు ‘దృశ్యం-3’ (Drishyam 3) రిలీజైంది. మొదటి 2 భాగాలతో పోలిస్తే, సినిమా మరీ లూజ్ గా ఉంది. చాలా చోట్ల తేలిపోయింది. ఇక ఇంతకుమించి ఈ కథను, జానర్ ను సాగదీయడం వృధా అనే ఫీలింగ్, మేకర్స్ కే కాదు, జనానికి కూడా వచ్చేసింది.
మొదటి 2 భాగాలు వెంకటేశ్ చేశారు. అవి తెలుగులో కూడా హిట్టయ్యాయి. కానీ మూడో భాగం మాత్రం ఆయన చేయలేదు. ఇలా చేయకపోవడం వల్ల వెంకీని అంతా మెచ్చుకుంటున్నారు. ఫ్రాంచైజీకి కక్కుర్తి పడి సినిమా చేసినట్టయితే, అనవసరంగా ఫ్లాప్ కొనితెచ్చుకున్నట్టయేది. అందుకే వెంకీపై ఈ ప్రశంసల జల్లు.
తాజా రెస్పాన్స్ తో ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి వెంకీకి కనెక్షన్ కట్ అయినట్టే. మేకర్స్ ధైర్యం చేసి మరో సీక్వెల్ రెడీ చేసినా, అందులో వెంకీ నటించే అవకాశాలు తక్కువ. ఇది ఫిక్స్.
