
MAA 2026 Diary: ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కఆవిష్కరించారు. ‘మా ‘ అధ్యక్షుడు విష్ణు మంచు డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి 2026 డైరీని విడుదల చేయించారు.
సభ్యుల కోసం ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్ లు వంటివి మా కార్యవర్గం చెయ్యడం అభినందనీయమని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీతో పాటుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జయవాణి, మలక్ పేట్ శైలజ, శివ నారాయణ, శశాంక్, హరనాథ్ బాబు, మానిక్, సంపూర్ణేశ్ బాబు, ఎం.ఆర్.సి. వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షుడు మంచు విష్ణు, కార్యవర్గ సభ్యులను అభినందించారు.
