
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన వల్ల పాపులర్ కాలేదు. ఆమెకి భారీ హిట్స్ కూడా లేవు. కానీ సోషల్ మీడియాలో అంతే ఎవరైనా ఒక నటిగా గ్లామర్ గా కనిపిస్తే లేదంటే తమ శరీరంలోని ఒక భాగాన్ని బాగా హైలెట్ చేస్తే ఆమెని పాపులర్ చేస్తారు. ఆమె ఫోటోలను, వీడియోలను వైరల్ చేస్తారు. అలా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న 35 ఏళ్ల మలయాళీ ముద్దుగుమ్మ ఈ అన్నా రాజన్.
ఆమె బ్యాక్ ని ఎక్కువగా హైలెట్ చేస్తూ ఉంటారు పాపారాజి. తాజాగా ఒక చాలా సెక్సీ ఫోటో వైరల్ అయింది. ఐతే తన ఫోటో కాదని అది మార్ఫింగ్ అని ఆమె ఆరోపిస్తున్నారు.
తన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో తన మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారని అన్నా రాజన్ ఆరోపించారు.
తాను ఆ అకౌంట్‌పై ఇన్‌స్టాగ్రామ్‌కు ఫిర్యాదు చేశానని, దీనికి బాధ్యులైన వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఆ నటి తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆ పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ఆమె ఇలా రాశారు, “నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ చిత్రాన్ని దురుద్దేశపూర్వకంగా మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా, పరువు తీసే విధంగా పోస్ట్ చేశారు. ఇది సిగ్గుచేటు, ఆమోదయోగ్యం కాదు, నా గౌరవానికి తీవ్ర భంగం కలిగించడమే.”
ఆమె మలయాళంలో అంగమలీ డైరీస్, అయ్యప్పనమ్ కోషియం (తెలుగులో “భీమ్లా నాయక్”) వంటి చిత్రాల్లో నటించింది.
ఆమె ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న “జైలర్ 2” (Jailer 2) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె లేడీ విలన్ గా కనిపిస్తారని టాక్.
