Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Dhanush: రజినీ తర్వాత బీజేపీ గుప్పిట్లో ఉన్న తమిళ హీరో!

TeluguCinema Team, July 27, 2026July 27, 2026
Dhanush

తమిళనాట రాజకీయాల్లో ఒక బ్రేక్ కోసం బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. రజినీకాంత్ ని రంగంలోకి దింపి, ఆయనతో పార్టీ పెట్టించి ద్రావిడ పార్టీలను అధికారం నుంచి దూరం చెయ్యాలని బీజేపీ ప్లాన్ వేసింది కానీ వర్కవుట్ కాలేదు. ఆరోగ్యం పేరు చెప్పి రజినీకాంత్ (Rajinikanth) రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. దాంతో, ఇప్పుడు ధనుష్ (Dhanush)ని బీజేపీ దువ్వుతున్నట్లు సమాచారం.

రజినీకాంత్ కి జూనియర్ అయిన విజయ్ ధైర్యం చేశారు. పార్టీ పెట్టి ఏకంగా మొదటి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. రజినీకాంత్ చెయ్యాలని పని విజయ్ చేశారు.

రజినీకాంత్ మాజీ అల్లుడు అయిన ధనుష్ ఒకవైపు దళిత సిద్ధాంతంతో కూడిన చిత్రాలు చేస్తూనే, బీజేపీ అనుకూల వైఖరితో ఉన్నాడు. తాజాగా అతను సామాజిక కార్యక్రమాలు ఎక్కువగా మొదలుపెట్టాడు.

ధనుష్ నటించిన “రాయాన్”, “కెప్టెన్ మిల్లర్” వంటి సాదాసీదా చిత్రాలకు మొన్న జాతీయ అవార్డుల్లో ప్రత్యేకంగా అవార్డులు దక్కాయి. విజయ్ సేతుపతి నటించిన మహారాజా వంటి చిత్రాన్ని పక్కన పెట్టి, అలాగే కార్తీ నటించిన “Meiyazhagan” ( తెలుగులో ‘సత్యం సుందరం’) వంటి ఉత్తమ చిత్రాలను పక్కన పెట్టి ‘రాయన్’కి అవార్డు ఇవ్వడంతో ధనుష్ ‘బీజేపీ ఫోల్డ్’లో ఉన్నాడు అని తమిళనాట ప్రచారం మొదలైంది.

ధనుష్ కూడా ఆ రెండు చిత్రాలు కూడా తన సినిమాల కన్నా ఉత్తమమైనవి అని అంగీకరించాడు. కానీ గతంలో తన మంచి చిత్రాలకు అవార్డులు రాలేదు. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని రాజకీయ నాయకుడిగా మాట్లాడాడు. సో, మెల్లగా ధనుష్ బీజేపీ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది అని టాక్. రజినీకాంత్ బదులు ఆయన మాజీ అల్లుడు బీజేపీకి భవిష్యత్ ల ట్రంప్ కార్డు అవుతాడట.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Katrina Kaif
    Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!
  • Akhil Akkineni, Zainab Ravdjee
    తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni
  • Devara
    Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!
  • Jayakrishna Ghattamaneni
    Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Sri Gouri Priya
    Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి

Recent News

  • Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!
  • Dhanush: రజినీ తర్వాత బీజేపీ గుప్పిట్లో ఉన్న తమిళ హీరో!
  • తన భార్యపై ట్రోలింగ్… తాజాగా స్పందించిన Akhil Akkineni
  • Irumudi: రవితేజ సినిమా విడుదల వాయిదా పడిందా?
  • Devara: అంచనాల కంటే 50 శాతం ఎక్కువ వసూలు చేసింది!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes