
దిశా పటానీ (Disha Patani) వ్యక్తిగత జీవితంపై పలు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆమె పంజాబీ సింగర్ తల్వీందర్‌తో సన్నిహితంగా ఉంటుందనే వార్తలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆమె పర్సనల్ లైఫ్ సంగతి పక్కన పెడితే ఆమె మళ్ళీ తెలుగులో నటించనుంది.
2015లో ఆమె వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత 2024లో విడుదలైన “కల్కి 2898AD”లో ప్రభాస్ సరసన కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ సరసన నటించనుంది. “కల్కి 2898AD”కి సీక్వెల్ గా రూపొందుతోన్న Kalki 2 సినిమాలో ఆమె మరోసారి ప్రభాస్ తో రొమాన్స్ చేసే సన్నివేశాల్లో నటిస్తుంది.
మొదటి భాగంలో ఆమెకి ఒక పాట దక్కింది. కానీ ఈ సారి ఆమెకి ఇంకా ఎక్కువ స్పేస్ దొరికే ఛాన్స్ కనిపిస్తోంది.
ప్రస్తుతం దర్శకుడు నాగ్ అశ్విన్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లకు సంబంధించిన సన్నివేశాలతో షూటింగ్ మొదలు పెట్టారు. ప్రభాస్ కొన్ని రోజుల తర్వాత షూటింగ్ లో పాల్గొంటారు. దిశా పటాని కూడా కొన్ని నెలల తర్వాతే షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.
