
నేహా శెట్టి (Neha Shetty) కెరీర్ ఇక ఎండ్ అయినట్లేనా… చూస్తుంటే ఆలా కనిపిస్తోంది. గతేడాది కేవలం “ఓజి” సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. ఇక తమిళ్ లో “డ్రాగన్” చిత్రంలో సైడ్ క్యారెక్టర్ చేసింది. ఈ రెండు సినిమాలను బట్టే ఆమెకి మెయిన్ హీరోయిన్ గా ఇక అవకాశాలు పూర్తిగా తగ్గినట్లే అనిపిస్తోంది.
ALSO READ: Neha Shetty – Beyond Black & White Photoshoot Pictures
నేహా శెట్టికి బాగా క్రేజ్ తెచ్చిన చిత్రం… “డీజె టిల్లు.” రాధిక అనే పాత్రలో అదరగొట్టింది. ఆ తర్వాత చేసిన ఏ సినిమా ఆడలేదు.
గతేడాది “ఓజి” సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే ఆ పాటనే తొలగించారు సినిమా నుంచి. ఇక తమిళ్ లో అడుగుపెట్టి “డ్యూడ్” అనే సూపర్ హిట్ సినిమాలో నటిస్తే ఆమెకి పేరు రాలేదు. ఎందుకంటే ఆమె కమెడియన్ సత్య సరసన నటించింది అందులో. హీరో ప్రదీప్ సరసన మమిత బైజు నటించింది.
అందుకే ఈ ఏడాది ఇప్పటి వరకు మరో అనౌన్సమెంట్ రాలేదు. దాంతో ఆమె ఇలా ఫోటోషూట్ లు చేసుకొని బిజీగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఆమె కెరీర్ మళ్ళీ రివైవ్ అవుతుందా? లేక 2026లో ఎండ్ కార్డు పడుతుందా? చూడాలి.
