
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్ హిట్ చిత్రాలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ (OTT Movies) పై సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ (Blast)తో పాటు, ప్రపంచవ్యాప్తంగా విజువల్ వండర్‌గా పేరుగాంచిన జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3) చిత్రాలు ఒకే వారంలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించబోతున్నాయి.
పెద్దగా అంచనాలు లేకుండా గత మే 28న థియేటర్లలో విడుదలై, సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రం ‘బ్లాస్ట్’. సీనియర్ నటుడు అర్జున్ సర్జా పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్‌కు తోడు ప్రీతి ముకుందన్ (Priety Mukundhan), అభిరామి, జాన్ కొక్కెన్ల నటన తోడవ్వడం సినిమాకు ప్లస్ అయింది.
ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూన్ 25 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అఫీషియల్‌గా స్ట్రీమింగ్ కానుంది.
మరోవైపు ప్రపంచ సినిమా రికార్డులను తిరగరాసిన విజువల్ వండర్ ‘అవతార్ 3’ నెటిజన్ల కోసం రెడీ అయింది. గతేడాది థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను సరికొత్త పండోరా లోకంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ విజువల్ వండర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ భారీ ధరకు కైవసం చేసుకుంది.
జూన్ 24 నుంచే ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ వారంలోనే స్ట్రీమింగ్ కాబోతున్న ఈ రెండు క్రేజీ చిత్రాలను మీ హోమ్ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయడానికి సిద్ధమైపోండి!
