
మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy) తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
మూడు సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత మనోజ్ – భూమ కుటుంబం మరింత అందంగా పెరిగింది. కుమారుడు ధైరవ్‌తో పాటు ఏప్రిల్ 2, 2024న జన్మించిన దేవసేన శోభ ఎంఎంతో మనోజ్, మౌనికల జీవితం మరింత అందంగా, ఆదర్శవంతంగా మారింది. వృత్తిపరంగా మనోజ్‌కి వివాహాం తరువాత మరింత కలిసి వచ్చింది. ‘మిరాయ్’ వంటి విజయం అందుకున్నాడు.
ప్రస్తుతం మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇది ఇప్పటికే భారీ అంచనాల్ని క్రియేట్ చేసింది. ఇంకా మరిన్ని ప్రాజెక్టుల్ని మనోజ్ పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఇక సినిమాలే కాకుండా మనోజ్ గత ఏడాది నవంబర్‌లో మోహన రాగ మ్యూజిక్‌ను ప్రారంభించారు.
మౌనిక సైతం తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. ‘నమస్తే వరల్డ్ సెలబ్రేటింగ్ కిడ్స్’ ఫౌండర్, సీఈవోగా స్వదేశీ బొమ్మల బ్రాండ్‌ను ప్రారంభించారు.
