
Vijay Divorce Case Update: తమిళ అగ్ర హీరో విజయ్ (Vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రెండు నెలల్లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ అన్ని సీట్లలో పోటీ చెయ్యనుంది. సరిగ్గా ఈ టైంలోనే ఆయన భార్య విడాకుల బాంబు పేల్చింది. విజయ్, ఆయన భార్య సంగీతకి గత ఐదేళ్లుగా గొడవలు ఉన్నాయి. భార్యాభర్తలుగా ఉంటూనే చాన్నాళ్లుగా ఇద్దరూ విడిగానే ఉంటున్నారు. కానీ సరిగ్గా ఎన్నికల వేళ ఆమె కోర్టులో విడాకులు కావాలని ఫైల్ చేశారు.
విడాకుల వ్యవహారంతో విజయ్ కొద్దిరోజులు బయటికి రాడు అని అనుకున్నారు. కానీ నిన్న (మార్చి 4) ఆయన భారీ బహిరంగ సభ పెట్టి తన ఎన్నికల ప్రచారం చేసుకున్నారు. జనం భారీగా వచ్చారు. ఆయన ఈ విడాకుల న్యూస్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.
ఐతే, ఈ వ్యవహారాన్ని ఎక్కువ నాన్చకుండా తొందర్లో విడాకులు తీసుకోమని విజయ్ సన్నిహితులు అతనికి చెప్పారట. వాళ్లే మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు టాక్. విజయ్ తన భార్య సంగీతకు రూ.250 కోట్ల ఇచ్చేలా సెటిల్మెంట్‌ను పూర్తి చేస్తున్నారు.
విజయ్, సంగీతకి ఇద్దరు పిల్లలు. ఈ మొత్తాన్ని వారికి ఇచ్చేసి పరస్పర అంగీకార విడాకులు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
