
Virosh Reception: విజయ్ దేవరకొండ, రష్మిక మందాన వివాహ వేడుక రిసెప్సన్ నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద హీరోల్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ హాజరయ్యారు. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ డుమ్మా కొట్టారు. ప్రభాస్ “కల్కి 2898 AD” సినిమాలో విజయ్ దేవరకొండ ఒక పాత్ర కూడా పోషించాడు. అయినా హాజరు కాలేదు. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఆయన తరపున నమ్రత, మహేష్ కూతురు సితార కొత్త దంపతులకు కంగ్రాట్యులేషన్స్ తెలిపారు.
ఎన్టీఆర్, విజయ్ దేవరకొండకి సరైన రిలేషన్స్ లేవు. విజయ్ నటించిన “కింగ్ డమ్” సినిమాకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినా అది నిర్మాత నాగవంశీ కోసమే.
ఇక సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున హాజరయ్యి కొత్త దంపతులను దీవించారు. నందమూరి బాలకృష్ణ డుమ్మా కొట్టారు. బాలయ్య మొన్న అల్లు శిరీష్ రిసెప్సన్ కి వెళ్లారు కానీ వీళ్ళ ఫంక్షన్ కి హాజరు కాలేదు.
మొత్తానికి విరోష్ (విజయ్ దేవరకొండ, రష్మిక మందాన) పెళ్లి వేడుకల కార్యక్రమం ఐదారు రోజులు మీడియా, సోషల్ మీడియాని హల్చల్ చేసింది.
