
సంయుక్త (Samyuktha) తెలుగులో చాలా సినిమాలు చేసింది. హిట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఐతే, సోలో హీరోయిన్ గా ఆమె హిట్ అందుకున్న చిత్రం పెద్దగా లేవు. ఒక్క ధనుష్ తో చేసిన “సర్” సినిమానే ఆమెకి సోలో హీరోయిన్ గా హిట్ అని చెప్పుకోవచ్చు.
“భీమ్లా నాయక్”లో ఆమె హీరోయిన్ కాదు. అలాగే “లవ్ మీ” అనే సినిమా పోయింది. అందులో కూడా ఆమె హీరోయిన్ కాదు. “విరూపాక్ష” చిత్రంలో ఆమె హీరోయిన్ అనలేం. అందులో ఆమెది స్పెషల్ రోల్ అని చెప్పొచ్చు. అది పెద్ద హిట్టే కానీ ఆ సినిమాలో ఆమె రెగ్యులర్ హీరోయిన్ పాత్రలో నటించలేదు. ఇక కళ్యాణ్ రామ్ తో నటించిన “డెవిల్” పోయింది.
అలాగే “అఖండ 2″లో నటిస్తే అది కూడా ఫ్లాప్. అందులో ఆమె బాలయ్య సరసన నటించింది కానీ విజయం దక్కలేదు. ఇక ఈ ఏడాది ఆమెకి “నారి నారి నడుమ మురారి”తో విజయం దక్కింది. కానీ ఇందులో ఆమె సోలో హీరోయిన్ కాదు.
ALSO READ: Samyuktha slays trendy look with effortless style
ఇప్పటివరకు ఆమె తెలుగులో సాలిడ్ సోలో హీరోయిన్ గా భారీ బ్లాక్ బస్టర్లు లేవు.

త్వరలో విడుదల కానున్న “స్వయంభు”లో మరో హీరోయిన్ ఆమెతో కలిసి నటిస్తోంది. విజయ్ సేతుపతి సరసన నటిస్తున్న “స్లమ్ డాగ్”, అలాగే “బ్లాక్ గోల్డ్” అనే సినిమాలు మాత్రం ఆమెకి సోలో హీరోయిన్ గా పేరు తెచ్చే అవకాశం ఉంది. అవి హిట్ కావాలి.
