
చాలామంది సింగర్స్ షోలు నిర్వహిస్తుంటారు. ఆ షోలలో తామే డ్యాన్స్ చేస్తారు. అలాగే వీడియో ఆల్బమ్స్ లో నటిస్తారు. కానీ సింగర్స్ ఐటెం గాళ్ గా మారిన సందర్భాలు ఇంతకుముందు లేవు అనే చెప్పాలి. జోనిత గాంధీ (Jonita Gandhi) ఈ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది.
ఆమె ఏ ఆర్ రెహమాన్, అనిరుధ్, తమన్ స్వరపరిచిన అనేక హిట్ సాంగ్స్ పాడి పాపులర్ అయింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అనేక పాటలు పాడింది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోషూట్ లు షేర్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండేది. అలా కుర్రకారులో మంచి పాపులారిటీ తెచ్చుకొంది. ఇప్పుడు ఏకంగా ఐటెం గాళ్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆమె ఐటెం గాళ్ గా నటించిన మొదటి చిత్రం…డెకాయిట్ (Dacoit). ఈ సినిమాలో చిచ్చుబుడ్డి (Chichubuddi) అనే పాటలో హీరో అడివి శేష్ తో కలిసి డ్యాన్స్ చేసింది. తన అందచందాలను ఆరబోసింది.
