
హీరోల పుట్టిన రోజు నాడు ఒక వీడియో, ఫోటో, లేదా టైటిల్ ప్రకటన చెయ్యడం సాధారణం. మరో పది రోజుల్లో అల్లు అర్జున్ ( Allu Arjun) పుట్టిన రోజు. మరి అల్లు అర్జున్ పుట్టిన రోజునాడు ఆయన కొత్త సినిమా నుంచి ఏమి విడుదల కాబోతోంది?
ఏప్రిల్ 8న పుట్టినరోజు. ఐతే ఒక రోజు ముందే అంటే ఏప్రిల్ 7న పోస్టర్ విడుదల చేస్తారట. అలాగే టైటిల్ వీడియో గ్లిమ్ప్స్ (AA22 Title Glimpse) కూడా ఏప్రిల్ 8న విడుదల కానుంది.
అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ తీస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకోన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, ఆమె అల్లు అర్జున్ సరసన నటిస్తుందా లేదా అనేది తెలియదు. కేవలం ఒక కీలకపాత్రలోనే కనిపిస్తుంది అని టాక్ ఉంది. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని ఇప్పటివరకు ఎక్కువ భాగం ముంబైలోనే చిత్రీకరించాడు అట్లీ.
కొంత భాగాన్ని విదేశాల్లో తియ్యనున్నారు.ఇప్పటివరకు తీసిన ఫ్యూటేజ్ నుంచే టైటిల్ వీడియో గ్లిమ్ప్స్ రిలీజ్ చెయ్యాలి అనుకుంటున్నారు.
