Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఎప్పటికీ గుర్తుండిపోతుంది: అనిల్ రావిపూడి

TeluguCinema, January 10, 2026January 10, 2026
Anil Ravipudi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తీస్తున్న చిత్రం… “మన శంకర వర ప్రసాద్ గారు.” ఇప్పటికే వెంకటేష్ హీరోగా మూడు సినిమాలు తీశారు అనిల్ రావిపూడి. ఇందులో కూడా ఆయనతో ఒక గెస్ట్ రోల్ చెయ్యించారు. గతేడాది “సంక్రాంతికి వస్తున్నాం” వంటి బ్లాక్ బస్టర్ అందుకొని ఇప్పుడు ఈ సంక్రాంతికి “మన శంకర వర ప్రసాద్ గారు” తీసుకొచ్చారు.

పోయిన సంక్రాంతికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి?

ఈసారి కొద్దిగా రిలాక్స్ గా ఉన్నాను. దానికి కారణం చిరంజీవి గారు. ప్రీరిలీజ్ ఈవెంట్లో హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ చేస్తే ఆ పాటకి చిరంజీవి గారు వేసిన డాన్స్, ఆయన ముందు నేను, వెంకటేష్ గారు కలిసి చేసిన అల్లరి ఇదంతా తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చేసింది. దీంతో చాలా రిలాక్స్ గా ఉన్నాను.

హుక్ స్టెప్ బాగా వైరల్ అయిందిగా.. ఈ పాట లేట్ గా ఎందుకు రిలీజ్ చేశారు?

దీని వెనుక ఒక కథ ఉంది. మీసాల పిల్ల, శశిరేఖ ఈ రెండు పాటలు కూడా మెలోడీ సాంగ్స్. చిరంజీవి గారి ఇంట్రడిక్షన్ కూడా అలాగే వచ్చింది. కానీ నాకు సంతృప్తికరంగా అనిపించలేదు ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు వర్షం పడి షూటింగ్ ఆగిపోయింది. నేచర్ సిగ్నల్ ఇచ్చిందని చిరంజీవి గారు చెప్పారు. ఆయనే సిగ్నల్ ఇచ్చారు కదా అని.. అప్పుడు ఈ సాంగ్ ని ఆలోచించడం మొదలుపెట్టాం. సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యాక లాస్ట్ షెడ్యూల్లో ఈ సాంగ్ షూట్ చేశాం.

భీమ్స్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడు.చాలా కొత్తగా చేశారు. ఆట సందీప్ ఎప్పటినుంచో చిరంజీవి గారి పాటకి కొరియోగ్రఫీ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాకి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని నిలబెట్టుకున్నాడు. అద్భుతమైన కొరియోగ్రఫీ చేశాడు. హుక్ స్టెప్ అనే పదం ఇచ్చింది పాట రాసిన రామజోగయ్య గారే.

మీరు సంక్రాంతికి వస్తే తిరుగు లేదనే పేరు వచ్చిందిగా?

అలా ఎక్కువగా ఒక ముద్ర పడటం కూడా మంచిది కాదు. ఒత్తిడి పెరుగుతుంది. సంక్రాంతి కొచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడనే అనే ఫీలింగ్ ఉంటే చాలు. మంచి కంటెంట్ తో ఎవరొచ్చినా సరే ఆ సినిమాలన్నీ ఆడతాయి. నా విషయంలో నేను ఎంచుకునే జోనర్స్ ఎక్కువగా మానవీయ సంబంధాలకి, ప్రతి ఫ్యామిలీ రిలేట్ అయ్యేలాగా ఉంటుంది. అది నాకు ప్లస్ అవుతుంది

ఈ సినిమాలో మీరు తీసుకున్న పాయింట్ ఏంటి?

ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్లో ఎక్కడా కూడా రివిల్ చేయాలని ఒక ఎమోషనల్ పాయింట్ ఈ సినిమాలో ఉంది. అది మీరు స్క్రీన్ మీద చూడాలి. కామెడీతో పాటు ఒక బలమైన ఎమోషనల్ రైడ్ ఉంటుంది. చిరంజీవి గారు, నయనతార గారు, పిల్లల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హృద్యంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారనేది చాలా కొత్త కోణంలో ఈ సినిమాలో చూపించడం జరిగింది. అది కచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఆ ఎమోషన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇది కరెక్టే కదా అని ఫీల్ అవుతారు.

చిరంజీవి గారికి ఈ కథే అని ఎందుకు అనుకున్నారు?

చిరంజీవి గారు మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత అన్నయ్య, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది లాంటి ఫ్యామిలీ జోనర్ ని ఆయన టచ్ చేయలేదు. ఈ జానర్ లో ఆయనకు సినిమా చేయలానే ఆలోచనతో ఈ కథని రెడీ చేశాను. పైగా ఒక హీరో క్యారెక్టర్ కోణంలో కథ నేను చెయ్యలేదు. అది ఈ సినిమాలో మొత్తం వర శంకర ప్రసాద్ క్యారెక్టర్ చుట్టూనే కథ తిరుగుతుంది. చిరంజీవి గారు చేసే అల్లరి ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ కూడా ఆడియన్స్ అందర్నీ ఒక టైం మిషన్లో తీసుకెళ్ళినట్టుగా వుంటాయి. ఆయన్ని నటుడిగా వ్యక్తిగా అభిమానించే అందరూ సినిమా చూసిన తర్వాత ‘వావ్’ అంటారనే నమ్మకం వుంది.

నయనతార ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా చేశారు కదా? ఎలా కుదిరింది?

నేను వర్క్ చేసే ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్స్ కి చాలా కంఫర్ట్ ఇస్తాను. మనం చాలా జెన్యూన్ గా ఒకటి అడుగుతున్నప్పుడు ఒక ఎమోషనల్ కనెక్షన్ అవతలి వాళ్ళకి జనరేట్ అయినప్పుడు కచ్చితంగా చెయ్యను అనుకున్నవాళ్లు కూడా చేస్తారు. నయనతార గారి విషయంలో కూడా అదే జరిగిందని అనుకుంటున్నాను. నయనతార చాలా హానెస్ట్. తనకు అనిపించింది చేస్తుంది తను బలంగా ఒకటి బిలీవ్ చేసినప్పుడు కచ్చితంగా చేస్తుంది.

Mana Shankara Vara Prasad Garu

ఈ సినిమాలో వెంకటేష్ ని కూడా నటింపచేశారు. ఇద్దరు బిగ్ స్టార్స్ ని ఎలా బ్యాలెన్స్ చేశారు?

బాలన్స్ అంటే మామూలుది కాదు అది రేపు సినిమాలో చూస్తారు. చిరంజీవి గారు వెంకటేష్ గారు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. వారి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దీంతో నాకు అంత కేక్ వాక్ అయింది. చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి చేసిన 18 రోజుల షూటింగ్ నా కెరియర్ లో వెరీ మెమొరబుల్. వారి కాంబినేషన్ లో 20 నిమిషాలు నాన్ స్టాప్ వినోదం ఉంటుంది. ఇందులో వెంకటేష్ గారు కర్ణాటక నుంచి వచ్చిన వెంకీ గౌడ అనే ఒక మైనింగ్ బిజినెస్ మాన్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వీరి సీన్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వీరితో షూటింగ్ చేసిన అనుభవం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

మీ సినిమాలు హిట్ అవుతాయి కానీ విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటాయి. మీరు క్రిటిసిజం, మీమ్స్ ని ఎలా తీసుకుంటారు?

తిట్టినా నవ్వుతా పొగిడినా నవ్వుతా. చాలా పాజిటివ్ గా ఉంటాను. హర్టు అవ్వను.

చిరంజీవి గారు ఇందులో కొన్ని సన్నివేశాలని తొలగించేస్తారని చెప్పారు..ఎలాంటి సీన్స్ తొలగించారు?

ఇందులో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ బ్లాక్ ని కట్ చేశాము. అది కథకి కాస్త అడ్డుపడుతోంది. అందుకే కట్ చేయడం చేయాల్సి వచ్చింది.

ఈ సినిమా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాని బీట్ చేస్తుందని అనుకుంటున్నారా?

అది ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. ఆ సినిమా కంటే అద్భుతంగా ఆడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అయితే సినిమాకి అన్ని వైపుల నుంచి వస్తున్న హైప్ చూస్తుంటే కచ్చితంగా ఒక పెద్ద ఓపెనింగ్ లాగా కనిపిస్తోంది. కచ్చితంగా ఇలాంటి సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి వస్తున్నాం సినిమాని ఇది బీట్ చేయాలని కోరుకుంటున్నాను.

తదుపరి చిత్రం ఏంటి?

ఈ సినిమా తర్వాత ఒక రెండు వారాలు రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత తర్వాతి చిత్రం గురించి ఆలోచిస్తాను.

బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవితో సినిమాలు చేశారు. నాగార్జున గారితో ఎప్పుడు సినిమా చేస్తున్నారు?

అందరూ అదే అడుగుతున్నారు. నేను కూడా అదే నేను అదే ఫీల్ అవుతున్నాను. ఆయనతో కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఆ సినిమా చేస్తే ఒకప్పటి నలుగురు అగ్ర కథానాయకులతో సినిమా చేసిన రికార్డు నాకే ఉండిపోతుంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Nayanthara
    Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!
  • Pooja Hegde: క్రేజ్ వేరు, సక్సెస్ వేరు
  • Aishwarya Rajesh
    Aishwarya Rajesh: స్టయిలింగ్ పై పడిన ఫోకస్!
  • Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు
  • Katrina Kaif
    Katrina Kaif: రీఎంట్రీ వార్తలు తప్పు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: త్వరలోనే 5 సినిమాలు
  • Bharathiraja
    Bharathiraja పేరు తొలిసారి విన్నప్పుడు
  • Nayanthara and her husband Vignesh Shivan in Venice
    Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే
  • Thaman
    దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’

Recent News

  • త్వరలో పెళ్లి కావాలని కోరుకుంటున్న Sreemukhi
  • ఇంతకీ ఏ పండుగ చేస్కోవాలి బాబూ Lenin!
  • Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes