
కూతురిపై పంచ ప్రాణాలు పెట్టుకున్న ఓ తండ్రి కథేంటో విషయం తెలుసుకోవాలంటే ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్ చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్.
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ “డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనుబడుటలేదు” (D/O Prasad Rao Kanabadutaledhu)
‘రెక్కీ’, ‘విరాటపాలెం’ మేకర్స్ నుంచి రాబోతోన్న మరో ఇంట్రెస్టింగ్, క్రైమ్, థ్రిల్లర్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.
ఆరు ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ సిరీస్‌ని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ మూవీకి మైదాల శృతి మాటల్ని రాయగా.. శ్రీ రామ్ మద్దూరి నేపథ్య సంగీతాన్ని అందించారు. ఇక ఈ చిత్రానికి చంద్రశేఖర్ జి.వి. ఎడిటర్‌గా, రామ్ కె మహేష్ కెమెరామెన్‌గా పని చేశారు. మున్ముందు మరింత ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంది.
