
ఇలా మే నెల మొదలైందో లేదో అలా బాక్సాఫీస్ బోసిపోయింది. ఏప్రిల్ నెలాఖరున రిలీజైన సినిమాలు తేలిపోగా, మే 1న విడుదలైన చిత్రాలు కూడా వేటికవే నిరాశపరుస్తున్నాయి. దీంతో ఆక్యుపెన్సీ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి.
తాజాగా వచ్చిన ‘జెట్లీ’ సినిమా క్లిక్ అవుతుందని భావించారు. కానీ ఈ సినిమా అక్కడక్కడ మాత్రమే నవ్వించింది. దీనికితోడు రకరకాల కామెడీలు పెట్టడంతో, ఒక దశలో ఏది కామెడీనో, ఏది సీరియస్సో అర్థంకాని పరిస్థితి వచ్చింది. మొదటిరోజు కొన్ని మల్టీప్లెక్సులు మిస్సవ్వడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది.
అటు ‘గాయపడ్డం సింహం’ పరిస్థితి కూడా ఇంతే. నవ్విస్తుందనుకున్న ఈ సినిమా అతికొద్ది నవ్వుల్ని మాత్రమే పంచింది. మంచి పాయింట్ ఎత్తుకున్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ లో తేడా కొట్టింది. ఈ రెండు సినిమాలతో పాటు వచ్చిన మిగతా సినిమాలేవీ నిలదొక్కుకోలేపోయాయి.
ఇక ఈ ‘వీకెండ్ గోదారి గట్టుపైన’ (Godari Gattupaina), ‘రేజర్’ (Razor), ‘సతీ లీలావతి’ సినిమాలొస్తున్నాయి. ఇవన్నీ చిన్న సినిమాలే. కనీసం వీటిలోనైనా ఒక సినిమా క్లిక్ అయితే బాక్సాఫీస్ కోలుకుంటుంది. లేదంటే అంతే సంగతి.
