
తరుణ్ భాస్కర్ దర్శకత్వం పక్కన పెట్టి హీరోగా, నటుడిగా బిజీ అయ్యారు. ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం… “ఓం శాంతి శాంతి శాంతిః”. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించింది. ఇద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్న ఈ చిత్రం పూర్తిగా గోదావరి జిల్లాల నేపథ్యంగా సాగుతుంది.
ఈ సినిమా నుంచి రెండో పాట తాజాగా బయటికి వచ్చింది. “ఓం శాంతి శాంతి శాంతిః” థీమ్ సాంగ్ ఇది. ఈ పాటని మహిళలకు అంకితం చేసింది టీం.
A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు.
జయ్ కృష్ణ హార్ట్ టచ్చింగ్ గా కంపోజ్ చేశారు. అభయ్ జోధ్‌పుర్కర్ గాత్రం మరింత అందాన్ని ఇచ్చింది. భరద్వాజ్ గాలి రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
