
నటి ప్రత్యూష (Prathyusha) కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. 24 ఏళ్ల తరువాత కేసులో ఈ తీర్పు వచ్చింది. గతంలో స్థానిక కోర్టు, హైకోర్టు తీర్పులు ఇచ్చి సిద్ధార్థ్ రెడ్డికి శిక్ష విధించాయి. సిద్దార్థ్ రెడ్డికి సెషన్స్ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించగా హైకోర్టు దాన్ని రెండేళ్లకు కుదించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సుప్రీంను ఆశ్రయించారు. ఇప్పుడు తుది తీర్పు వచ్చింది. సిద్ధార్థ్ రెడ్డి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాలి.
కానీ ప్రత్యూష తల్లి మాత్రం న్యాయం జరగలేదు అని అంటున్నారు.
“24 ఏళ్లుగా నరకం అనుభవించాను. పోరాటం చేస్తూనే ఉన్నాను,” అని ఆమె అన్నారు.
ఇది సరైన న్యాయం కాదు అని ఆమె భావన. సిద్ధార్థ్ రెడ్డికి జైలు శిక్ష పడడం వరకు న్యాయమే అయినా తన కూతురికి జరిగిన అన్యాయానికి తగిన శిక్ష కాదు అని ఆమె ఆవేదన.
