
‘పెద్ది’ సినిమా నుంచి రెండో పాట వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి పాట ‘చికిరి..చికిరి’లో ఉన్నట్టుగానే.. రెండో సాంగ్ ” ‘రై..రై..రారా” (Rai Rai Raa Raa)లో కూడా హుక్ స్టెప్ ఉంది. అయితే ఇది అందరూ ప్రయత్నించేలాంటి డాన్స్ మూమెంట్ కాదు.
ఎంతో సాధన, ఇంకెంతో ఫిట్‌నెస్ ఉంటే తప్ప, ఈ మూమెంట్‌ను రీ-క్రియేట్ చేయలేం. అందుకే సాంగ్ రిలీజైన వెంటనే చాలామంది రీల్స్‌పై అనుమానం వ్యక్తం చేశారు. కానీ అందరి అనుమానాల్ని పటాపంచలు చేస్తూ, ‘రై..రై..రారా’ సాంగ్ స్టెప్‌ను కూడా రీల్స్‌గా చేస్తున్నారు చాలామంది.
చరణ్ ఎంతో ప్రాక్టీస్ చేసి వేసిన ఈ స్టెప్‌ను చాలామంది కుర్రాళ్లు చాలా ఈజీగా వేసేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వైరల్ స్టెప్‌పై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఇది మాత్రమే కాదు, ‘ది ప్యారడైజ్’కు సంబంధించి నాని హుక్ స్టెప్ ను కూడా జనం బాగానే రీల్స్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అది కూడా కాస్త కష్టమైన డాన్స్ మూమెంటే.
బయట చాలా టాలెంట్ ఉందనే చర్చ ఈ రీల్స్ తో మొదలైంది. అంతేకాదు, హుక్ స్టెప్పులు, సిగ్నేచర్ స్టెప్పుల ట్రెండ్ మరోసారి మొదలైనట్టు కూడా కనిపిస్తోంది.
