Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

వెంకీ మామపై కేసు కొట్టేశారు

Admin, March 30, 2025
Venkatesh in Sankranthiki Vasthunnam

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పెద్ద హిట్టయింది. భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అక్కడ కూడా హిట్టయింది. తర్వాత టీవీల్లోకొచ్చి అక్కడ కూడా హిట్టయింది. ఇలా ఆ సినిమా రన్ అన్ని విభాగాల్లో ముగిసినప్పటికీ, కోర్టులో మాత్రం మొన్నటివరకు ఈ సినిమాపై పెట్టిన కేసు నడుస్తూనే ఉంది. ఎట్టకేలకు అది కూడా క్లియర్ అయింది.

ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచారు. లెక్కప్రకారం, భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే టికెట్ రేట్ల పెంపు ఇస్తారు. ఈ సినిమాకు భారీబడ్జెట్ ఖర్చవ్వలేదని, కాబట్టి టికెట్ రేట్ల పెంపు నిర్ణయం సమంజసం కాదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది.

ఈ సినిమా బడ్జెట్ పై ఈడీతో దర్యాప్తు చేయించాలంటూ లక్ష్మణ కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇది కోర్టు పరిధిలోకి రాదని, అధికారుల్ని సంప్రదించాలని పిటిషనర్ కు సూచించింది. పైగా ఈ కేసు దాఖలు చేయడం వెనక ప్రజోపయోగం కంటే, సొంత ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశం కనిపిస్తోదంటూ అనుమానం కూడా వ్యక్తం చేసింది.

మరీ ముఖ్యంగా సినిమాకు సంబంధించి అన్ని  ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమా గురించి విచారించడం అనవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఈ సినిమా రిలీజైన టైమ్ లోనే ఆదాయపు పన్నుశాఖ అధికారులు, దిల్ రాజు నివాసాలు, ఆస్తులు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. ఇదే విషయాన్ని దిల్ రాజు తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు

Recent News

  • నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Varanasi: ఓవర్సీస్ రేట్లు మరీ ఓవర్ గా ఉన్నాయట
  • Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Ram Pothineni: ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes