
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది శ్రీలీల. చిన్నప్పట్నుంచి ఇప్పటివరకు తల్లి పక్కన లేకుండా ఈమె నిద్రపోలేదంట. రాత్రిళ్లు తన పక్కన అమ్మ ఉండాల్సిందే అంటోంది శ్రీలీల.
సడెన్ హా నిద్రలో మెళకువ వచ్చినప్పుడు పక్కన అమ్మ లేకపోతే వణికిపోతుందంట శ్రీలీల. అంతలా తనకు అమ్మ అలవాటైపోయిందని చెబుతోంది. అయితే ఈమధ్య గడిచిన 6 నెలలుగా పక్కన అమ్మ లేకుండా నిద్రపోతున్నట్టు తెలిపింది.
తన జీవితమంతా అమ్మే అంటోంది శ్రీలీల. ఇప్పటికీ తన నిర్ణయాలన్నీ అమ్మ చేతిలోనే ఉంటాయని, తనకు ఏది మంచిదో తనకంటే అమ్మకే బాగా తెలుసని చెబుతోంది.
ALSO READ: శ్రీలీలకు స్ఫూర్తి ఎన్టీఆర్ అంట!
జగపతి బాబు నిర్వహిస్తున్ చాట్ షోలో తల్లితో కలిసి పాల్గొంది శ్రీలీల. ఈ చిట్ చాట్ షోలో ఇలా తన వ్యక్తిగత విషయాల్ని బయటపెట్టింది. చరణ్, ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టింది ఈ హీరోయిన్.





